LIQUOR SCAM: ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్
మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు;
లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అంతే కాదు ఈ కేసులో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా ఏపీ పోలీసులను ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్ మిథున్ రెడ్డి నేరుగా లింక్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొంది. అరెస్టు అనేది సమంజసమైన, హేతుబద్దమైన కారణాలతోనే చేయాలని తెలిపింది. పోలీసులు ఓ కేసు నమోదు కాగానే యాంత్రికంగా అరెస్టులు చేయడం సరికాదని వెల్లడించింది. తగిన కారణం ఉంటేనే అరెస్టు చేయాలని అభిప్రాయపడింది. ఇలాంటి కేసులో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడి గౌరవాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కాబట్టి హైకోర్టు ఈ కేసులో మరోసారి సమగ్రంగా విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టులో మరోసారి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.