lokesh: రప్ప రప్పా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారు: లోకేశ్
గిరిజన యువకుడిపై దాడిపై స్పందించిన నారా లోకేశ్;
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్‌ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగాడు. పవన్ అనే గిరిజన యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్‌పల్లిలోని తన ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు. గిరిజన యువకుడిని చితకబాదుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీయగా వైరల్‌గా మారింది. కార్ డెకార్స్‌కు సంబంధించిన దుకాణం తనకు ఇవ్వాలంటూ భూమన ప్రధాన అనుచరుడు చైతన్య యాదవ్ ఓ వ్యక్తిపై దాడికి దిగిన ఘటన మరువక ముందే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అనిల్ రెడ్డి.. బాధితుడిని చిత్రహింసలు పెట్టాడు. పవన్‌ను కిడ్నాప్ చేసి బుధవారం తిరుపతిలోని ఎంఆర్‌పల్లిలోని తన ఇంట్లో బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు. గిరిజన యువకుడిని చితకబాదుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. అన్నా వదిలేయండి అంటూ యువకుడు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మరింత రెచ్చిపోయి రక్తం కళ్లజూస్తూ రాక్షసానందం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు రఫ్ఫాడిస్తారు: లోకేశ్
తిరుపతి లో యువకుడిపై వైసీపీకి చెందిన వ్యక్తులు దాడి చేసిన ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ' ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదని తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై వైసీపీ నాయకులు దమనకాండ చేశారన్నారు. రపరపా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారని లోకేశ్ హెచ్చరించారు.