lokesh: "ఏపీని కాపాడేందుకు ముందుకొచ్చారు"
సింగపూర్‌లో లోకేశ్ కీలక చర్చలు;
సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏదేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు. మోదీ పర్యటనలోనూ తెలుగువారంతా పాల్గొని విజయవంతం చేయాలి’’ అని లోకేశ్ చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు.
సైమన్ టాన్‌తో మంత్రి లోకేశ్ భేటీ
సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్ సెల్, మాడ్యూల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీ–2024ను ప్రకటించామని వివరించారు. దీనికి సైమన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఐదేళ్లు విధ్వంస పాలన
సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏ దేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. PM మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు’ అని చెప్పారు