LOKESH: ఇది తెలుగుదేశం 3.0.. పైరవీలతో పనిలేదు

టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు... పైరవీలకే ఛాన్సే లేదన్న ఏపీ మంత్రి.. అందరికీ ఎదిగే అవకాశం ఉందన్న లోకేశ్

Update: 2026-04-10 04:45 GMT

తె­లు­గు­దే­శం పా­ర్టీ­ని కా­లా­ని­కి అను­గు­ణం­గా రూ­పాం­త­రం చెం­దిం­చే ది­శ­గా సమ­గ్ర మా­ర్పు­లు చే­ప­డు­తు­న్నా­మ­ని ఆ పా­ర్టీ జా­తీయ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి నారా లో­కే­ష్ స్ప­ష్టం చే­శా­రు. గ్రామ స్థా­యి నుం­చి పొ­లి­ట్‌­బ్యూ­రో వరకు సం­స్థా­గ­తం­గా పు­న­ర్వ్య­వ­స్థీ­క­రణ చే­ప­డు­తు­న్న­ట్లు తె­లి­పా­రు. ప్ర­తి టర్మ్‌­లో కనీ­సం 33 శాతం కొ­త్త­వా­రి­కి అవ­కా­శా­లు కల్పిం­చ­డం ద్వా­రా పా­ర్టీ­కి తా­జా­ద­నం తీ­సు­కు­రా­వా­ల­న్న­దే లక్ష్య­మ­ని పే­ర్కొ­న్నా­రు. కష్ట­ప­డి పని­చే­సే కా­ర్య­క­ర్త­కు ఏ స్థా­యి నుం­చై­నా పై­స్థా­యి­కి ఎద­గ­డా­ని­కి అవ­కా­శం ఉం­డా­ల­ని ఆయన వి­వ­రిం­చా­రు. పా­ర్టీ కే­డ­ర్‌­ను చై­త­న్య­వం­తం చే­య­డం­లో భా­గం­గా ని­ర్వ­హి­స్తు­న్న శి­క్ష­ణా తర­గ­తు­ల్లో పా­ల్గొ­న్న లో­కే­ష్, “కాఫీ కబు­ర్లు” పే­రు­తో బూత్ నుం­చి క్ల­స్ట­ర్ స్థా­యి ఇన్‌­చా­ర్జీ­ల­తో సమా­వే­శ­మ­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా పా­ర్టీ ప్ర­స్తు­తం “టి­డి­పి 3.0” దశ­లో­కి అడు­గు­పె­ట్టిం­ద­ని, సాం­కే­తి­క­త­ను వి­ని­యో­గి­స్తూ కే­డ­ర్ పని­తీ­రు­ను అం­చ­నా వే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. సభ్య­త్వ సం­ఖ్య­ను ఆధా­ర్‌­లా ఉప­యో­గి­స్తూ ప్ర­తి కా­ర్య­క­ర్త పని­ని గు­ర్తిం­చ­గ­లు­గు­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. పై­ర­వీ­ల­కు తా­వు­లే­కుం­డా కృషి చే­సిన వా­రి­కే పద­వు­లు ఇవ్వా­ల­ని పా­ర్టీ ని­ర్ణ­యిం­చిం­ద­ని వె­ల్ల­డిం­చా­రు.

పార్టీని మరింత బలోపేతం చేయడానికి శిక్షణా కార్యక్రమాలు కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, యూనిట్ స్థాయిల్లో ఏడాది పొడవునా ఈ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీని రాజకీయ విశ్వవిద్యాలయంతో పోల్చుతూ, ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు దేశవ్యాప్తంగా ఎదిగారని గుర్తుచేశారు.

గతం­లో కూడా ఇలాం­టి శి­క్ష­ణా వి­ధా­నా­లు ఉన్న­ప్ప­టి­కీ, ఇప్పు­డు వా­టి­ని మరింత వి­స్తృత స్థా­యి­లో అమలు చే­స్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. పా­ర్టీ­లో వ్య­క్తుల కంటే వ్య­వ­స్థ ము­ఖ్య­మ­ని లో­కే­ష్ స్ప­ష్టం చే­శా­రు. “నేనే అన్న భావన” నా­య­కు­ల్లో ఉం­డ­కూ­డ­ద­ని, పా­ర్టీ మా­త్ర­మే శా­శ్వ­త­మ­ని ఆయన చె­ప్పా­రు. భవి­ష్య­త్ నా­య­క­త్వా­న్ని తయా­రు­చే­య­డం ప్ర­తి నా­య­కు­డి బా­ధ్యత అని పే­ర్కొ­న్నా­రు. గతం­లో వ్య­క్తు­ల­పై ఆధా­ర­ప­డ­టం వల్ల పా­ర్టీ­కి నష్టం జరి­గిం­ద­ని, ఇకపై వ్య­వ­స్థ ఆధా­రం­గా ముం­దు­కు సా­గు­తు­న్నా­మ­ని అన్నా­రు. దీ­ర్ఘ­కా­లం­గా అధి­కా­రం­లో ని­ల­వా­లం­టే క్ర­మ­శి­క్ష­ణ­తో కూ­డిన కే­డ­ర్ అవ­స­ర­మ­ని, ఆ వి­ష­యం­లో ఇతర జా­తీయ పా­ర్టీల నుం­చి నే­ర్చు­కో­వా­ల్సిన అం­శా­లు ఉన్నా­య­ని సూ­చిం­చా­రు. తన రా­జ­కీయ అను­భ­వా­న్ని పం­చు­కు­న్న లో­కే­ష్, మం­గ­ళ­గి­రి ని­యో­జ­క­వ­ర్గం­లో ఎదు­ర్కొ­న్న ఓటమి తర్వాత కృ­షి­తో సా­ధిం­చిన వి­జ­యా­న్ని ఉదా­హ­ర­ణ­గా చె­ప్పా­రు. భారీ మె­జా­రి­టీ­తో గె­లి­చి­న­ప్ప­టి­కీ, ఇంకా బల­హీ­నం­గా ఉన్న ప్రాం­తా­ల­పై దృ­ష్టి పె­ట్టా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు. పా­ర్టీ­లో సమ­స్య­లు ఉంటే వా­టి­ని అం­త­ర్గ­తం­గా చర్చిం­చి పరి­ష్క­రిం­చు­కో­వా­ల­ని, వి­భే­దా­లు బయ­ట­ప­డి­తే పా­ర్టీ­కి నష్టం జరు­గు­తుం­ద­ని హె­చ్చ­రిం­చా­రు.

Tags:    

Similar News