ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్
నెల్లూరులో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.;
నెల్లూరులో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. దీంతో యువత నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబీకులను లోకేష్ పరామర్శించారు. ఉద్యోగాలు లేకపోవడం వలనే, రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు లోకేష్. తక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు లోకేష్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికారులు తొలగించారు. కార్యక్రమం ప్రారంభం కాకుండానే ప్లెక్సీలను తొలగించడంపై తెలుగు యువత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ వస్తున్నారన్న భయంతోనే అధికార పార్టీ నాయకులు ఈదారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల విషయంలో హామీని విస్మరించిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తీ జరుగుతుందని హెచ్చరించారు.