అవును.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పనితనం గురించే చర్చ జరుగుతోంది. తమిళ నాడు నుంచి ఉత్తరాది రాష్ట్రాల దాకా లోకేష్ సమర్థత గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల ఐటీ మినిస్టర్లను లోకేష్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఆయన ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత నిబద్ధత లేకపోతే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు తీసుకొస్తారు.. ఎంత పట్టుదల లేకపోతే వైసీపీ హయాంలో వద్దు బాబోయ్ అని పారిపోయిన కంపెనీలను పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకొస్తారు. ఇదే కదా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు ఏపీకి ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తున్నాయంటే అందులో లోకేష్ పాత్రనే ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ప్రతి కంపెనీ దగ్గరకు స్వయంగా ఆయనే వెళ్తున్నారు. నేనెందుకు వెళ్లాలి అనే అహం ప్రదర్శించకుండా ఒకటికి రెండు సార్లు ఆయా కంపెనీల ఆఫీసులకు వెళ్లి.. రండి మా ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని వాళ్లను ఒప్పిస్తున్నారు. ఆ ఫలితం నేడు ఏపీలో కనిపిస్తోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లోకేష్ పై స్పెషట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీజేపీ నేతలతో కూడా మోడీ పెద్దగా గడపరు. కానీ లోకేష్ ను ఢిల్లీకి రమ్మన్నారు. లోకేష్ కుటుంబంతో ఢిల్లీకి వెళ్తే ప్రధాని గంటకు పైగా ఆయనతో గడిపారు. నిన్న శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఎక్కడో దూరంగా నిలబడ్డ లోకేష్ ను స్వయంగా దగ్గరకు పిలిపించుకుని లోకేష్ చేతుల మీదుగా బుక్ ను అందుకున్నారు.
నరేంద్ర మోడీ ఇలా గుర్తు పెట్టుకుని మరీ ఒక నేతకు ఇంత ప్రాధాన్యత అస్సలు ఇవ్వరు. కానీ లోకేష్ విషయంలో ఆయన చూపిస్తున్న ఇంట్రెస్ట్ కు కారణం పనితనం. ఎక్కడో వెనకబడ్డ ఏపీని ఇప్పుడు టెక్ ప్రపంచానికి కేంద్రంగా మార్చేస్తున్నారు లోకేష్. అందుకే వ్యాపార, టెక్, సైన్స్ రంగంలో లోకేష్ గురించే చర్చ జరుగుతోంది. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. హై స్కూల్ స్థాయి నుంచే ఏఐ క్లాసులు పెట్టిస్తున్నారు. అందుకే లోకేష్ ను చూసి నేర్చుకోవాలంటూ కర్ణాకట ఐటీ మినిస్టర్ ను, తమిళనాడు ఐటీ మినిస్టర్ ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తనకు ఇచ్చిన పనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వంద శాతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు లోకేష్. తన శాఖలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఏపీలో ఇప్పుడు కూటమి మైలేజ్ పెరుగుతోందంటే దానికి కారణం లోకేష్ కూడా ప్రధాన కారణమే అని చెప్పాల్సిందే.