తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అడపాల వెంకట శివ అనే దొంగను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి అచ్యుతాపురం గ్రామం, పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా వాసిగా గుర్తించారు. అతని వద్ద నుండి 540 గ్రాముల బంగారు ఆభరణాలను,అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు పలమనేరు పోలీసులు. వీటి విలువ సుమారు 40 లక్షల 36 వేల రూపాయలు ఉంటుందని సమాచారం, ఇతనిపై రాష్ట్రమంతటా 12 కేసులో ముద్దాయిగా ఉన్నాడని, గతవారం పలమనేరు పట్టణంలోని రాధా బంగ్లా వద్ద ఓ ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో పలమనేరు పోలీసులు వెంకట శివాను అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని,అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు.