Giant Fish : వావ్.. భారీ సొరచేప.. బరువు టన్నున్నర

Update: 2024-07-29 10:00 GMT

కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు రెండురోజుల క్రితం 1500 కిలోల నీటి సొర చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్యాకారులకు ఇటీవల మంగినపూడి, గిలకలదిండి తీరాల్లో నాలుగు నీటి సొర చేపలు సంచరిస్తూ కనిపించాయి.

వేటకు వెళ్లిన మచిలీపట్నం మండలం చిన్న కరగ్రహారం, క్యాంప్ బెల్పోటకు చెందిన మత్యకారులు ఒక నీటి సొరను చాకచక్యంగా పట్టుకుని ఫైబర్ బోట్ సహాయంతో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ కు తీసుకొచ్చారు.

క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీశారు. ఈ చేప తినేందుకు పనికి రాదు. అయితే ఈ నీటి సొర చేప కడుపులో ఏమైనా నల్ల బంగారం దొరుకుతుందేమోనన్న ఆశతో.. ఆ చేపను కోయగా వారికి నిరాశే మిగిలింది. దీనితో ఆ చేపను ముక్కలుగా కోసి మళ్ళీ సముద్రం లోనే పడేసారు. కాగా భారీ చేప చిక్కడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Tags:    

Similar News