Sucharita: నేను రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే కొనసాగుతా: సుచరిత
Sucharita: మంత్రివర్గ విస్తరణతో రగిలిన అసంతృప్త జ్వాలలను చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నారు సీఎం జగన్..;
Sucharita: మంత్రివర్గ విస్తరణతో రగిలిన అసంతృప్త జ్వాలలను చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నారు సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.. దాదాపు రెండున్నర గంటలపాటు ఇద్దరి భేటీ సాగింది.. కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సుచరిత.. అయితే, ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సుచరిత కూల్ అయినట్లు తెలుస్తోంది.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ తప్పుడు ప్రచారం చేశారని సుచరిత అన్నారు.. తాను రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. రాజకీయాలు విరమించుకుంటే వైసీపీ కార్యకర్తగా, ఓటురుగా ఉంటానన్నారు.