పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మిగిలింది పార్టీ విలీనమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోవడమే కాకుండా ఇప్పుడు సొంత మండలం కూడా పోయిందన్న ఆయన.. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి.. ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాడేమో…? ఆయనకు మిగిలింది అదొక్కటే అని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే ప్రజలు పులివెందులలో టీడీపీకి విజయం అంధించారని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే.. అన్నం ఒడికిందో లేదో.. ఎలా తెలుస్తుంది.. ఇప్పుడు ప్రజల మనోగతం ఈ ఎన్నికలతో తెలుస్తుందన్నారు.. అయితే, వైఎస్ జగన్‌కు ప్రజాస్వామ్యవ్యవస్థపై, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం లేకపోవడంతోనే ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
వైసీపీ కార్యకర్తను చితకబాదిన జగన్ గన్మెన్లు
అనంతపురంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి గన్మెన్లు వైసీపీ కార్యకర్తను చితబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన జగన్.. తిరుగు పయనంలో వాహనంపైకి ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ సమయంలో భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జగన్ గన్మెన్లు ఓ వైసీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ కూడా స్పల్ప అస్వస్థతకు గురయ్యారు.