AP : 4 నగరాలతో మెగా సిటీ.. మంత్రి నారాయణ గుడ్ న్యూస్.. మళ్లీ రియల్ బూమ్
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ సర్కారు తమ విజన్ ను బయటపెట్టింది. విజయవాడ, మంగళగిరి, అమరావతి, గుంటూరు కలిపి మెగాసిటీగా మారతాయని తెలిపారు మంత్రి నారాయణ. ఆ విధంగానే అమరావతి నిర్మాణ ప్రణాళికలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. జనవరిలో జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షోకు సంబంధించి.. గుంటూరు క్లబ్‌లో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికరంగం పురోగమనానికి స్థిరాస్తి రంగం చాలా కీలకమని అందుకే లే ఔట్ల అనుమతులు విషయంలో సడలింపులు తెస్తున్నామని నారాయణ వివరించారు.