ఏపీ శాసనమండలిలో డిస్కషన్ వాడీవేడిగా జరిగింది. రిజర్వేషన్లపై వైసీపీ, కూటమి సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. జగన్ కాపుల ద్రోహి అన్నారు మంత్రి సవిత. భవనాలు నిర్మించడమంటే రంగులు మార్చినంత సులువుకాదన్నారు సవిత. గత ప్రభుత్వ విధానాలతో చాలా మంది సోమరులు అయ్యారని విమర్శించారు. మంత్రి సవిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది