విజయవాడ వరద బాధితులకు మంత్రి సవిత తనయుడు జగదీశ్ సాయి తన వంతు సాయం చేశారు. తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.21 వేలను సీఎం చంద్రబాబుకు అందించారు. చిన్న వయసులోనే సహృదయంతో ఆలోచించిన ఆ బాలుడిని అందరూ అభినందిస్తున్నారు. కాగా వారంరోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సవిత పర్యటిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆమె చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.