Vangalapudi Anitha : రోడ్డుపై స్పీడ్‌గా స్కూటీ నడుపుతున్న మైనర్లు.. హోంమంత్రి అనిత ఏం చేసిందంటే..?

Update: 2025-09-30 11:45 GMT

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తన పర్యటనలో భాగంగా రోడ్డుపై వేగంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఇద్దరు మైనర్ బాలురను గమనించి, వారిని సుతిమెత్తగా మందలించారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అతి వేగంగా స్కూటీ నడుపుతున్న మైనర్లను చూసిన మంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి, వారి వద్దకు వెళ్లి మాట్లాడారు.

బాలుర వివరాలను అడిగి తెలుసుకున్న హోం మంత్రి, వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం అని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత విషయంలో బాధ్యత వహించాలని, ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ఆమె సూచించారు.

Tags:    

Similar News