MLA Ganababu : అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా ప్రాధాన్యత ఇవ్వడం ఆనందదాయకం
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా ప్రాధాన్యత ఇవ్వడం ఆనందదాయకం: ఎమ్మెల్యే గణబాబు ఉత్తరాంద్ర జిల్లాలపై సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఆధారణకు నిదర్శనమే అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా ప్రాధాన్యత ఇవ్వడం ఆనందదాయకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరిస్తున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కేంద్రంలో అశోక్ గజపతి రాజుకు ఒక సముచిత స్థానం కల్పించడం బట్టి మనకు ఎంత ప్రధాన్యతను కల్పిస్తున్నారనేది అర్థం అవుతుందన్నారు. విశాఖలో ఒక ఎలేవేటెడ్ తో కూడిన మెట్రో కారిధార్ నిర్మించడం ఆయన కు ఇక్కడ ప్రాధాన్యత ఎంతో గుర్తు చేస్తోందన్నారు. లక్షలాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తోందని గణబాబు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతోందనే అపోహ నుండి, మన ముఖ్యమంత్రి ప్రధాన మంత్రితో మాట్లాడిడానికి నిధులు కేటాయించి ఉత్పత్తి సామార్థ్యం పెంపొందించారన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. సంపద సృష్టించాలనే సదుద్దేశ్యంతో ఆ ఇబ్బందులను అధిగామిస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు ఒకటవ తేదీన జీతాలు వొచ్చే పరిస్థితి లేదని, కాని కూటమి ఎడాది పాలన లోనే జీతాలతో పాటు, పేద ప్రజలకు పెంక్షన్ లు కూడా అందిస్తున్నామని ఎమ్మెల్యే గణబాబు వెల్లడించారు. ఈ ఎడాది అభివృద్ధి పాలనపై ప్రజల తరుపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని గణబాబు తెలిపారు.