AP: నాపై ఆ వార్తలు రాశారో.. చంపేస్తా: గుమ్మనూరు జయరాం
సోషల్ మీడియాలో వైరల్.. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ హెచ్చరిక;
మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై చేసి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుంతకల్లు సిటీ శివారులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. గుంతకల్ పట్టణ శివారులోని ధోని మొక్కల లేఔట్ లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు.
గృహాల పరిశీలన..
లేఔట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సమస్యల గురించి ఆరా తీశారు.. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలు మొత్తాన్ని విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. గతంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలపై విచారణ చేపట్టాలని అక్కడున్న అధికారులకు ఆదేశించారు.
మీడియాకు బెదిరింపులు
తనపై కొందరు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ వార్తలు రాస్తున్నారని.. ఆ వార్తలు రాసే ముందు నిరూపించే ధైర్యం ఉన్న వాళ్లే అలాంటి వార్తలు రాయాలని మాజీ మంత్రి జయరాం వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు మీడియా అంటే ఏమాత్రం లెక్క లేదని కామెంట్ చేశారు. తాను అన్నీ పనులు చేసి వచ్చిన వాడినని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో అంటూ తేల్చి చెప్పారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే మాత్రం తాట తీస్తానని హెచ్చరించారు. ఒక వేళ తప్పులు ఉంటే వాటన్నింటినీ నిరూపించాలని మీడియా ప్రతినిధులకు సవాల్ విసిరారు. అయితే, మీడియాపై కూటమి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.