Sujana : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా దంపతులు

Update: 2025-09-22 09:54 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.మొదటి రోజు,బాల త్రిపుర సుందరి దేవి అలంకారం లో దర్శనమిచ్చిన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈ ఓ, అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. సుజనా దంపతులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారేను సమర్పించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుజనా సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సుజనా ఆకాంక్షించారు.

Tags:    

Similar News