MLC Ananthababu: సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు?
MLC Ananthababu: డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్యచేసినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్టు తెలుస్తోంది.;
MLC Ananthababu: డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్యచేసినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే.. సుబ్రమణ్యాన్ని హత్యచేసినట్టు అనంతబాబు పోలీసుల వద్ద అంగీకరించినట్టు సమాచారం. సుబ్రమణ్యాన్ని తాను ఒక్కడినే హత్య చేశానని, ఇందులో మరెవరి ప్రమేయం లేదని పోలీసుల విచారణలో చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సుబ్రమణ్యం మృతికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సాయంత్రం వెల్లడించనున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ కొనసాగుతోంది. సాయంత్రంలోపు పోలీసులు ఎమ్మెల్సీ అరెస్ట్‌ను చూపించే అవకాశం కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచే అనంతబాబు పోలీసుల అదుపులో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ అరెస్ట్ ప్రకటనపై ఉదయం నుంచి ఎస్పీ, ఏఎస్పీ అధికారులతో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చర్చలు జరుపుతున్నారు. అరెస్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఆదివారం ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారించినట్టు ప్రచారం జరుగుతోంది.