ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన మంత్రుల బృందం, సభ ప్రధాన వేదిక ప్రాంగణం, అమరావతి రాజధాని పైలాన్‌ను పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాల నుండి వచ్చే ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని, 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్చార్జి అధికారిని నియమించి ఎక్కడా ఎటువంటి ఆటకం కలగకుండా సభా స్థలికి చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.