Rains in AP : ఏపీని వెంటాడుతున్న వానగండం

Update: 2024-10-14 15:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ను వానగండం వెంటాడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షసూచనతో తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు.

Tags:    

Similar News