AP Movie Tickets: ఏపీలో మళ్లీ సినిమా టికెట్ల రగడ.. ఆన్‌లైన్‌లో..
AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. APFDC ద్వారా టికెట్లు అమ్మాలని సర్కార్ నిర్ణయించింది.;
AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. APFDC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు ఎంఓయూలు కుదుర్చుకోవాలని ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే టికెట్లు అమ్మిన తర్వాత ఎగ్జిబిటర్లకు డబ్బులు ఎప్పుడు.. ఎలా చెల్లిస్తారనేదానిపై మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ససేమిరా అంటున్నారు.
ఫిలిం ఛాంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తమకు సమ్మతమేనని.. చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జులై 2వ తేదీ లోపు ఎంఓయూలపై సంతకం చేయాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఎగ్జిబిటర్లను వార్నింగ్ ఇస్తోంది. అయితే ప్రభుత్వం నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అవసరమైతే థియేటర్లను మూసివేస్తామని అంటున్నారు.