ఎంపీ రఘురామ కృష్ణరాజు : పార్టీ పెట్టే ఉద్దేశం నాకు లేదు.. కానీ..
ఎంపీ రఘురామ కృష్ణరాజు : పార్టీ పెట్టే ఉద్దేశం నాకు లేదు.. కానీ.. పార్టీ పెట్టే ఉద్దేశం, ఆలోచన తనకు లేదన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. తాను..;
పార్టీ పెట్టే ఉద్దేశం, ఆలోచన తనకు లేదన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. తాను ఇప్పటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు. పార్టీ పార్లమెంటరీ తనను దూరం పెడుతోందని.. తనతో ఎంపీలు ఎవరూ మాట్లాడం లేదన్నారు రఘరామ. ఇంకెన్ని రోజుల ఈ నాటనాలు.. దైర్యం ఉంటే తనను పార్టీ నుంచి పంపించివెయ్యొచ్చుగా అని ఎంపీ రఘురామ సవాల్ చేశారు.
ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు ఎంపీ రఘురామ. పోలీసులను కోర్టు తీవ్రంగా మందలించిందన్నారు. ఓ మతం దీవెనలు పొందడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు ఎంపీ. పోలీసు వ్యవస్థ రాజ్యాంగ బద్ధంగా పని చేయాలని.. ఎందుకు సరెండర్ అయ్యారని రఘురామ పశ్నించారు.
భీమవరంలోని తన ఆఫీస్‌పై దాడి జరిగే కుట్ర జరుగుతుందని ఎంపీ రఘురామ ఆరోపించారు. దళితుల ముసుగులో తన ఆఫీస్ పై దాడికి కుట్ర పన్నారని అన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గానికి రమ్మని కొందరు తనకు సవాల్ చేస్తున్నారని.. కొవిడ్ నిబంధనల పేరుతో తనపై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారని.. అనంతరం భౌతికదాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు.
హిందూ సర్టిఫికేట్ పేరుతో కొందరు క్రిస్టియన్స్ - హిందూ మతంపై దాడి చేస్తున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఆదేశాల మేరకే ఈ కుట్ర జరుగుతుందన్నారు. హిందువులారాఇకనైనా మేల్కొండి అన్నారు ఎంపీ.
దళితుల ముసుగులో..తమ దళిత హిందువులకు రావాల్సిన రిజర్వేషన్లను క్రిస్టియన్స్ కొట్టేస్తున్నారని ఎంపీ రఘురామ అన్నారు. ఇక్కడ మతం ప్రచారానికి, మార్పిడికి ఫండ్స్ అందుతున్నాయిని అన్నారు. కొందరు ఫాస్టర్స్ కూడా హిందూ సర్టిఫికెట్స్ పొందారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్నారు.