ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయింది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ ఎన్నిక కాగా తుది ఫలితాలను సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటించనున్నారు. వైసీపీ ఐదేండ్ల పాలనలో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు చేజిక్కించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏసీఏకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికలను సవాలుగా తీసుకుని మొత్తం కార్యవర్గం ఏకగ్రీవం కావడంలో సఫలికృతమయ్యారు.