పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని, గెలిస్తే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపధం చేసిన కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం.. పవన్ గెలిచిన తర్వాత తన పేరు మార్చుకున్నారు. అప్పటినుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. తిరిగి తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని దొంగ హామీలుగా మార్చారని ఆరోపించారు. రోడ్లు వేసేందుకు నిధులు లేవంటూ ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్లు వేస్తానని చంద్రబాబు చెప్పారు.. రోడ్లమీద వెళుతున్నందుకు ప్రజలు టాక్స్ కట్టాలా అని నిలదీశారు. ప్రజలను మోసం చేయడం అబద్దాల చక్రవర్తి చంద్రబాబుకు అలవాటని ముద్రగడ విమర్శించా