వేమిరెడ్డి దంపతులపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేయాలి కానీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దాడులను ఎవరు ప్రోత్సహించరు... ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపట్ల ఆగ్రహంతో ఎవరైనా వేమిరెడ్డి అభిమానులు కార్యకర్తలు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్దారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ అధికారులను వేమిరెడ్డి దంపతులు ఆదేశించారని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నోసార్లు సహాయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రసన్నకే కాదు ఎంతోమంది నాయకులకు విపిఆర్ ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు. ఎన్నికలకు 15 రోజులు ముందు కూడా వేమిరెడ్డి దంపతులు శివపార్వతులని కొనియాడిగిన ప్రసన్న... నేడు జుగుప్సాకారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపింది. నెల్లూరులోని కొండాయపాలెం గేటు సెంటర్‌లో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్‌ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు