విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ఇదే పేరుతో వర్సిటీ యాజమాన్యం కార్యకలాపాలు సాగించనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు ఆ పేరును మళ్లీ మార్చారు. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.
కాగా, గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మారుస్తూ.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ 2022లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ పరిణామాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. ఇక, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు