తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించని ఆయనకు పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్‌కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తోందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. కాగా ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ‘NTR సీఎం అయ్యాక సినిమాల్లో నటించడం పూర్తిగా మానేశారు. చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలియదు. మధ్యలో ఓ సినిమాలో నటించాల్సి వస్తే కేంద్రం నుంచో, సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకున్నారు. మీరు కూడా NTR తరహాలోనే సినిమాలు మానేసి ప్రజాసేవకు మీ జీవితాన్ని అంకితం చేయండి’ అని సూచించారు