వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లెంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మద్దతుదారుడైన ట్రాక్టర్ డ్రైవర్‌పై.. వైసీపికి చెందిన మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ రామచంద్రుడి కుమారుడు సుధీర్ దాడి చేశాడు. ఈ విషయం తెలియడంతో టీడీపీ వర్గాల ప్రశ్నించడానికి వెళ్లాయి. ట్రాక్టర్ డ్రైవర్‌పై ఎందుకు దాడి చేశారని నిలదీశాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులతో పాటు చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.