nani: మరింత బరితెగిస్తున్న పేర్ని నాని
‘76 ఏళ్ల ముసలోడివి.. ఎంతకాలం బతుకుతావ్?’... చంద్రబాబుపై నాని కామెంట్స్;
76 ఏళ్ల ముసలోడివి నువ్వు ఎంతకాలం బతుకుతావ్? 50 ఏళ్ల జగన్ను భూస్థాపితం చేస్తావా? అది నీ తరమా, నీ కొడుకు తరమా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తారా? అని రెచ్చిపోయారు. పెడనలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని తన నోటికి పనిచెప్పారు. తాను నరికేయండని అనలేదంటూనే.. వివాదాస్పదంగా మాట్లాడారు. ‘అరేయ్.. నేను అనాలంటే పట్టపగలే వేసేయమని చెబుతాన్రా, చీకటిలో నరికేయండని అనలేదు’ అంటూ మళ్లీ రెచ్చగొట్టారు. ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు.
పేర్ని నాని, వైసీపీ సీనియర్ నేత. ఇదివరకు వైసీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. "రప్ప రప్ప ఏంటి.. చీకట్లో కన్ను కొట్టి సైలెంటుగా చేసేయాలి" అని అనడంతో.. ఆ వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో, మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు పేర్ని నానిపై కంప్లైంట్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.