Nara Lokesh: గర్జించనున్న యువగళం....

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం; ఈ నెల 27 నుంచి ప్రారంభం; సుమారు 29కిలో మీటర్లు...;

Update: 2023-01-13 08:11 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ నెల 27 నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కుప్పంలోనే యాత్ర కొనసాగుతుంది.


లోకేశ్ కుప్పం నియోజకవర్గంలో సుమారు 29 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు..  వరదరాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేశారు..

Tags:    

Similar News