Nara Lokesh : అశేష జనవాహిని మధ్య రాప్తాడులో యువగళం

Update: 2023-03-30 13:09 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.. అశేష జనవాహిని మధ్య రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ అడుగు పెట్టారు.. యువనేత పరిటాల శ్రీరామ్‌ ఎదురెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.. లోకేష్‌ దగ్గరకు వెళ్లి ఆయన్ను హగ్‌ చేసుకున్నారు.. ఈ దృశ్యాన్ని చూసిన టీడీపీ శ్రేణులు ఫుల్‌ ఖుషీ అయిపోయాయి.. మాజీ మంత్రి పరిటాల సునీతను చూసి లోకేష్‌ హృదయపూర్వకంగా నమస్కారం పెట్టారు.. ఆ వెంటనే పరిటాల సునీత కొబ్బరికాయతో లోకేష్‌కు దిష్టి తీశారు.. ఇక నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు పసుపు చీరల్లో వచ్చారు.. రాప్తాడు నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించగానే జై టీడీపీ, జై లోకేష్‌ అంటూ నినాదాలు మిన్నంటాయి.

పరిటాల సునీత, శ్రీరామ్‌ పూల బొకేలతో స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా లోకేష్‌కు వారిని ఆప్యాయంగా పలకరించారు.. ఈ దృశ్యాలు టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.. ఇక లోకేష్‌ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు.

Similar News