LOKESH: తిప్పితిప్పి అవే ప్రశ్నలు: నారా లోకేశ్
ముగిసిన లోకేశ్ సీఐడీ విచారణ.. ఢిల్లీ వెళ్లిన యువనేత;
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ C.I.D అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ తిప్పితిప్పి అడిగారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తెలిపా రు. గతంలో తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. తొలిరోజు 50 ప్రశ్నలు అడిగిన అధికారులు... రెండోరోజు 47 ప్రశ్నలు అడిగారని వివరించారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు... ఒక్కరోజు విచారణకు హాజరుకావాలని చెప్పినా సీఐడీ అధికారులు 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని కోరడంతో రెండో రోజూ హాజరైనట్లు లోకేశ్ తెలిపారు. రెండో రోజూ ఆరు గంటలు విచారించిన అధికారులు 47 ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. కేసుతో సంబంధం లేకపోయినా..తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్నులు తెచ్చి వాటిపై ప్రశ్నించారని లోకేశ్ చెప్పారు. అవి ఎలా వచ్చాయని అధికారులను తాను ప్రశ్నించగా సమాధానం దాటవేశారని వివరించారు. రింగ్‌రోడ్డు వల్ల హెరిటేజ్ భూములు కోల్పోయినట్లు అధికారులు చూపించారని లోకేష్ తెలిపారు. ఐఆర్‌ఆర్‌లో..... తనకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధిస్తోందని లోకేశ్ దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు జైల్లో A క్లాస్ సౌకర్యాలను కల్పించడం లేదన్నారు. రాజమండ్రిలో ఉక్కపోత వల్ల చంద్రబాబు డీ హైడ్రేషన్‌కు గురయ్యారని లోకేశ్ చెప్పారు. జగన్ ప్రభుత్వ వేధింపుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ పెట్టుబడులు పెట్టట్లేదని లోకేశ్ ఆరోపించారు. C.I.D. అధికారుల విచారణ ముగిసిన అనంతరం.. లోకేశ్ దిల్లీ వెళ్లారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగనున్న క్రమంలో... న్యాయవాదులతో లోకేష్ చర్చించనున్నట్లు సమాచారం.
లింగమనేని రమేశ్‌కు చెల్లించిన అద్దె చెల్లింపులపై ప్రశ్నించారని. రమేశ్ ఇంట్లో అద్దెకు ఉంటూ రూ.27లక్షలు రెంటల్ అడ్వాన్స్ కట్టారని, అందుకు సంబంధించి ఐటీ రిటర్న్స్‌లో లేదని చెప్పారని లోకేశ్ వివరించారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని చెప్పానని. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? సాక్షిలో ఉన్న 10 రూపాయల షేరు.. రూ.350కి కొనుగోలు చేసినట్టు.. లింగమనేని రమేశ్ షేర్లు ఎక్కడా కొనలేదని వివరించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి సాక్షికి కట్టబెట్టినట్టు మేము ఎక్కడా చేయలేదన్న లోకేశ్... ఏపీలో సాక్షి మీడియా తప్ప ఇంకెవ్వరూ పెట్టబడులు పెట్టే పరిస్థితి లేదన్నారు. సాక్షి ఉద్యోగుల జీతాలు పెంచేందుకు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. సంబంధం లేకపోయినా తనపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రభుత్వ చర్యలతో నష్టపోయేది రాష్ట్ర నిరుద్యోగ యువతే అని అన్నారు.