అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంఘీభావం ప్రకటించారు. ఉదయం నుంచి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన.. అన్నదాతలకు మద్దతు తెలిపారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నవారు ఇక్కడి భవనాలు ఎక్కి దూకాలని సవాల్ విసిరారు. 3 రాజధానులపై ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.