AP: వాకౌట్ చేయకుండా ఉంటే చర్చిద్దాం: నారా లోకేశ్

టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం... తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్;

Update: 2025-02-25 06:45 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారని ఆరోపించారు. దీనిపై లోకేశ్ స్పందించారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని స్పష్టం చేశారు. వాకౌట్ చేయకుండా సభలో ఉంటే అన్ని అంశాలు చర్చిద్దామని అన్నారు.

ఇంగ్లీష్ మీడియంపై దుమారం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై దుమారం చెలరేగింది. ఇంగ్లీష్ రాకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు రావని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు కూడా ఉన్నత స్థానాలకు వెళ్లారని టీడీపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. దీనిపై వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

పోర్టులపై గందరగోళం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. పోర్టులపై ప్రభుత్వం తీరును ఎమ్మెల్సీ మాధవరావు తప్పుపట్టారు. దీనిపై మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి మధ్యలో జోక్యం చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పదేపదే అడ్డు తగులుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుడు మాట్లాడుతుండగా అడ్డు తగలొద్దంటూ ఛైర్మన్ సూచించారు.

Tags:    

Similar News