అనూష కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడిన నారా లోకేష్..!
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్మాది చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన.. అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాల్‌లో పరామర్శించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్మాది చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన.. అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాల్‌లో పరామర్శించారు. అనూషని తీసుకురాలేను కానీ.. కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. అనూష తమ్ముడి భవిష్యత్తు నా బాధ్యతని లోకేష్ పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా న్యాయ పోరాటానికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. తప్పకుండా నరసరావు పేట వచ్చి కలుస్తానని లోకేష్ పేర్కొన్నారు.