ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు : లోకేష్
రైతు ఆత్మహత్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్;
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో 753 మంది రైతులు బలయ్యారని ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్ అన్నారు.
ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.ఇన్సూరెన్స్ నుంచి మద్దతు ధర వరకు జగన్ .. రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు నారా లోకేష్. చందర్లపాడులో కౌలు రైతు లక్ష్మీనారాయణ ఆత్మహత్య బాధాకరమన్నారు. అప్పుల బాధ భరించలేక పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
వైసీపీ అభిమాని అయిన లక్ష్మీనారాయణ... కౌలు రైతుల కష్టాలు వివరిస్తూ లేఖ రాసి చనిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు లోకేష్. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతుల్ని ఆదుకోవాలన్నారు.
జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్స్యూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని @ysjagan ఘోరంగా మోసం చేసారు.(1/3) pic.twitter.com/yoKsNKaEnO
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 20, 2021