టీడీపీ డిమాండ్లను జగన్‌రెడ్డి పరిశీలించి నేతన్నను ఆదుకోవాలి - లోకేష్
Nara Lokesh: జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని.. చేనేత సోదరులకు నారా లోకేష్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.;
Nara Lokesh: జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని.. చేనేత సోదరులకు నారా లోకేష్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. మోసపు నేత జగన్‌రెడ్డి చేయి తిరిగిన కళాకారుడన్నారు లోకేష్. గతంలో నేతన్నకు ఏడాదికి 50 వేలకు పైగా ప్రోత్సాహకాలు వచ్చేవని.. జగన్ పాలనలో 24 వేలు మాత్రమే వస్తున్నాయన్నారు. ఆప్కో కొనుగోళ్లు, రాయితీలే ఆగిపోయాయని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా టీడీపీ డిమాండ్లను జగన్‌రెడ్డి పరిశీలించి నేతన్నను ఆదుకోవాలన్నారు. చేనేత కార్మికులకు టీడీపీ ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలను కొనసాగించాలని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.