Yuvagalam: జమ్మలమడుగులో లోకేష్ పాదయాత్ర
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 14వందల 11 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది;
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 14వందల 11 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఎన్.కొత్తపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా పెద్దపసుపుల జంక్షన్ లో పెద్దముడియం గ్రామస్తులతో లోకేష్ సమావేశం అవుతారు. అనంతరం పెద్దపసుపుల చర్చి వద్ద క్రిస్టియన్లు, చావిడి వద్ద గ్రామస్తులతో సమావేశం కానున్నారు.
అక్కడి నుంచి పాదయాత్రగా జమ్మలమడుగు బైపాస్ రోడ్డుకు చేరుకుని.. ముస్లింలతో భేటీ అవుతారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే పాదయాత్రగా జమ్మలమడుగు బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడితో 110వ రోజు పాదయాత్ర ముగిస్తోంది. రాత్రికి లోకేష్ ఇక్కడే బస చేస్తారు.