నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో యువనాయకత్వం ఎదిగింది అంటే అందులో కచ్చితంగా లోకేష్ పేరు ఉంటుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు వారసుడు అయినా సరే.. లోకేష్ మీద వచ్చినన్ని ట్రోల్స్, మీమ్స్, అవమానాలు అన్ని ఇన్ని కావు. వ్యక్తిగతంగా ఆయన మీద వైసీపీ నేతలు చేసిన దాడులు బహుశా ఇంకెవరి మీద చేసి ఉండరేమో. లోకేష్ వ్యక్తిత్వాన్ని ఖననం చేసేలా వైసిపి నేతలు చేసిన ఆరోపణలు, హేళనలు చెప్పుకోలేనివి. ఒకప్పుడు ఇదే మంత్రి నారా లోకేష్ ను పట్టుకొని వైసీపీ మంత్రులు పప్పు అంటూ దారుణంగా మాట్లాడారు. కానీ అలాంటి వ్యక్తి నిప్పులా మారి వైసిపి అవినీతి సామ్రాజ్యాన్ని తగలబెట్టేశాడు. ఎన్ని రకాలుగా తనను అవమానిస్తున్నా సరే మంత్రి లోకేష్ ఎప్పుడూ టెంప్ట్ కాలేదు.
తన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని.. తన తల్లిదండ్రులను మళ్లీ సంతోషంగా చూడాలి అనే తాపత్రయంతోనే కష్టపడ్డాడు నారా లోకేష్. మంగళగిరిలో ఓడిపోయినా సరే వెనుతిరగలేదు. పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండాను ఎగరేశారు. టిడిపి చరిత్రలోనే మంగళగిరిలో రానంత మెజారిటీని సాధించారు. పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నారా లోకేష్. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.
పార్టీలో యువ నాయకత్వాన్ని నారా లోకేష్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అవమానించిన వారు ఇప్పుడు మంత్రి లోకేష్ ను చూసి తలదించుకునే పరిస్థితులు వచ్చాయి. ఆయనను అత్యంత దారుణంగా అవమానించిన వైసిపి మంత్రులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇప్పుడు తాను అధికారంలో ఉన్నా సరే ఎవరి మీద కక్షపూరిత చర్యలకు లోకేష్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా హుందాతనంగా వ్యవహరిస్తున్నారు. చివరకు జగన్ ను వ్యక్తిగతంగా టిడిపి నేతలు ఎవరైనా విమర్శిస్తే కూడా లోకేష్ వద్దని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వ్యక్తిగతంగా అవమానించొద్దని టిడిపి నేతలకు చెబుతూ తన నాయకత్వాన్ని నిరూపించుకుంటున్నారు నారా లోకేష్.