నేడు ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు..!
ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.;
ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. దీనిని గవర్నర్ ఆమోదించారు. ఇవాళ నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు.. 10న ఫలితాలు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయ నిపుణులతో పాటు ప్రభుత్వ అధికారుల సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రతిపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్‌ఈసీగా నియమించడం గమనార్హం.