Andhra Pradesh : సంత్ కబీర్ అవార్డుకు నెల్లూరు వాసి..సీఎం చంద్రబాబు అభినందనలు

Update: 2025-07-10 06:45 GMT

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు లక్క శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 7వ తేది జాతీయ చేనేత దినోత్సవం రోజున న్యూడిల్లీ లో గౌరవం రాష్ట్రపతి చేతులు మీదుగా సంత్ కబీర్ అవార్డును అందుకొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ బొప్పావరం కు చెందిన చేనేత కార్మికుడు అయిన లక్కా శ్రీనివాసులు వెంకటగిరి జిందాని చీరలు నేత చేయడంలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లక్కా శ్రీనివాసులు ఎంపిక కావడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.

Tags:    

Similar News