Minister Nadiendla : ప్రజల ఆరోగ్యం విషయంలో నో కాంప్రమైజ్.. హోటళ్లలో తనిఖీలు చేపట్టిన నాదేండ్ల
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని... లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో వెలుగు చూసిన వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి అన్నారు. 51 రెస్టారెంట్లలో తనిఖీ లు చేయగా...వీటిలో 44 చోట్ల ఆహార నాణ్యతా నిబంధనలను గాలికి వదిలేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పురావృతం కాకూడదని మంత్రి హెచ్చరించారు.
కొన్ని హోటళ్ల నిర్వాహకులు నాసిరకం, హానికరమైన పదార్థాలను వంటకాలలో కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు" అని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించిందని, నిబంధనలు పాటించని సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేస్తామన్న ఆయన...ఎంతటి పెద్ద సంస్థలైన చట్టప్రకారం చర్యలు తప్పవన్నారూ. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతపై ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.