AP : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

Update: 2025-07-23 09:00 GMT

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్, డెంటల్ వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటీఫికేషన్ జారీ చేసింది. నీట్ ఎగ్జామ్ రాసి స్థానిక ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 29 వరకు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అలాగే లేట్ ఫీజుతో ఈ నెల 30, 31 తేదీల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.

https://apuhs-ugadmissions.aptonline.in అనే వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2360 అప్లికేషన్ ఫీజు సమర్పించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ రూ.22,950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.22,360 చొప్పున లేట్ ఫీజుతో ఈ నెల 30, 31వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News