NTR Birth Anniversary: ఎన్‌టీఆర్ శత జయంతి వేడుకలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో..
NTR Birth Anniversary: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి..;
NTR Birth Anniversary: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు నారావారిపల్లి గ్రామస్తులు. గజమాలలు వేసి నివాళులర్పించారు. తమ గ్రామంలో దళితులకు మొదటి కాలనీని కట్టించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
శ్రీశైలం మాజీ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ శివరామరెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంబరాన్నంటాయి.. మహానాడు కోసం పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలి వెళ్లిన టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు..
పొదిలి-మార్కాపురం రోడ్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాగ్యనగరంలో పార్టీలకతీతంగా నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. భారతరత్నకు ఎన్టీఆర్ అర్హులు అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రసాదించిన రాజకీయ జీవితంతో ఎంతో మంది ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారన్నారు
కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.. తొమ్మిది అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానంద, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్, ఆదర్శనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు..
ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. నిజాంపేటలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.
ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నిలిచారని కొనియాడారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా టౌన్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.