Cyclone Jawad: జవాద్ తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Jawad: తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Update: 2021-12-04 07:30 GMT

Cyclone Jawad: తీవ్ర తుఫానుగా మారిన జవాద్ తుఫాన్‌.. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 340 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది వాతావరణశాఖ. తుఫాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు స్పష్టం చేసింది.

క్రమంగా దిశ మార్చుకుని రానున్న 12 గంటల్లో పూరీ తీరానికి చేరుతుందని అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.

తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తీరప్రాంతంలోని 54 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక కార్యక్రమాల కోసం 11 NDRF, 5 SDRF, ఆరు కోస్ట్‌గార్డు, 10 మెరైన్ పోలీసు బృందాలను మోహరించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెలియపుట్టిలో కొబ్బరిచెట్టు విరిగిపడి యువతి చనిపోయింది.

Tags:    

Similar News