Minister Tummala : 2-3 రోజుల్లో అకౌంట్లోకి ఆయిల్‌పామ్ డబ్బులు: మంత్రి తుమ్మల
ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao ) తెలిపారు. దీంతో పాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అటు 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.80.10 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వం రూ.53.40 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 59,261 ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి వచ్చినట్లు చెప్పారు. పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.