Nara Lokesh : నేతన్నల అభ్యున్నతే మా ధ్యేయం - నారా లోకేశ్

Update: 2025-08-07 16:30 GMT

దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నలు నేసిన వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని తెలిపారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని.. చేనేత అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు తెలిపారు.చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. నేతన్నల అభ్యున్నతే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News