నన్ను గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తాను : పనబాక లక్ష్మి

హోదాపై మాట తప్పిన BJPకి ఎందుకు ఓటు వెయ్యాలని తిరుపతి TDP అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రశ్నించారు.

Update: 2021-04-07 12:00 GMT

హోదాపై మాట తప్పిన BJPకి ఎందుకు ఓటు వెయ్యాలని తిరుపతి TDP అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో YCP రద్దుల ప్రభుత్వంగా తయారైందని.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తేనే వచ్చే 3 ఏళ్లయినా కొంచెం మంచి పాలన అందిస్తారని అన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం తనకుందని.. తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని పనబాక లక్ష్మి అన్నారు.

Tags:    

Similar News