విశాఖ ఎంవీపీ కాలనీలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. కొండ చిలువను చూసిన జనం భయంతో పరుగులు తీశారు. ఎంవీపీ కాలనీలోని ఎంవీపీ రైతు బజార్ దగ్గరలోగల అన్న క్యాంటీన్ పక్కన దుఖాణంలో కొండ చిలువ కనిపించింది. కొండ చిలువ ఒక్కసారిగా కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది కొండ చిలువను బంధించి అడవిలో వదిలిపెట్టారు.