పరకామణి వివాదం కేసు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో కీలకంగా మారిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆశ్చర్యంగా కేవలం 15 నిమిషాల్లోనే విచారణ పూర్తయింది. అయితే ఆ 15 నిమిషాల్లో సీఐడీ వేసిన ప్రశ్నలు మాత్రం చాలానే ఉన్నట్టు సమాచారం. దొంగ రవికుమార్ అకస్మాత్తుగా “దాత” ఎట్లా అయ్యాడు, లోక్ అదాలత్‌లో రవికుమార్–సతీష్ కుమార్ రాజీ ఎందుకు, ఎలా కుదిరింది, ఆ రాజీ వెనక ఎవరి ఒత్తిడి ఉంది, సతీష్ కుమార్ మరణాన్ని ఎందుకు ఆత్మహత్య అన్నారు, ఈ వ్యవహారంలో పాలిటికల్ జోక్యం ఎంత వరకు ఉంది అనే కోణంలో విచారించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రశ్నలన్నిటికీ భూమన సమాధానాలు ఇచ్చినట్టు సీఐడీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ముఖ్యంగా, కొన్ని నిర్ణయాలు రాజకీయ ఒత్తిడి వల్లే జరిగాయని భూమన అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. అదే ఇప్పుడు కీలక పాయింట్‌గా మారింది. భూమన సమాధానాల్లో బయటకు వచ్చిన ఈ “పాలిటికల్ ప్రెషర్” మాట సీఐడీ దృష్టిని ఒక స్పెసిఫిక్ దిశగా తిప్పింది. దీంతో, ఈ రాజీ ఒప్పందం వెనక చిన్న నాయకులు కాదని, పెద్ద రాజకీయ నేతలే ఉన్నారన్న అనుమానాన్ని అధికారులు మరింత గట్టిగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉండగా, భూమనను మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, రవికుమార్ ఎలా దాతగా మారాడు? సతీష్ కుమార్ కేసు చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా క్లియర్ కాలేదు. అంతేకాదు, లోక్ అదాలత్‌లో రాజీ ఎలా జరిగిందన్న విషయంలో ఇంకా చాలా లూప్‌హోల్స్ ఉన్నాయని సీఐడీ భావిస్తోంది. ఈ కేసు రోజు రోజుకూ కొత్త ట్విస్ట్ లతో ముందుకు సాగుతోంది. పరకామణి కేసు ఎక్కడ ఆగుతుందో, ఎవరెవరిని తాకుతుందో అని వైసీపీ నేతల్లో గుబులు మొదలైపోతోంది.